అటవీ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న కుటుంబీకులు బంధువులు గ్రామస్తులు
కుమ్రం భీం ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బెంగాలి క్యాంప్ 6 నెంబర్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి పై పులి దాడి చేయడంతో మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో మృతురాలి బంధువులు గ్రామస్తులు కాగజ్ నగర్ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల జిల్లాలోని జైనుర్ వాంకిడి మండలాల్లో పులి పశువులపై దాడి చేసిన సంఘటన మర్చిపోకముందే శుక్రవారం కాగజ్ నగర్ మండలంలో పులి దాడిలో మహిళ మృతి చెందిన సంఘటనతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులుల దాడుల నుండి కాపాడాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.