Monday, May 12, 2025

పులిని హతమార్చిన అటవీ అధికారులు

కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియార్ గ్రామంలో జనావాసాల్లోకి పులి సంచరించింది. సమాచారం అందుకున్న అటవీ అదికారులు దానిని బంధించేందుకు ప్రయత్నించారు. కానీ అది తమపై దాడిచేసేందుకు ప్రయత్నించడంతో పులి నుంచి తమను తాము రక్షించుకునేందుకు అటవీ అధికారులు దానిని కాల్చి చంపారు. అప్పటికే పులి కొన్ని పశువులను చంపి తినేసింది. ఈ క్రమంలో నిన్న ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్టు వారు గుర్తించారు. దానికి మత్తుమందు ఇచ్చేందుకు 15 మీటర్ల దూరం నుంచి తొలుత కాల్పులు జరిపారు. దీంతో అది ఒక్కసారిగా వారిపైకి లంఘించి దాడిచేసేందుకు యత్నించింది. దీంతో ఆత్మరక్షణ కోసం వారు మళ్లీ కాల్పులు జరపడంతో అది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఆ పులి వయసు పదేళ్లు ఉంటుందని పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com