- ప్రజలను అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు
- పాదముద్రల ఆధారంగా గుర్తించే ప్రయత్నం
ఏజెన్సీలో చాలా రోజుల తర్వాత పులి సంచరిస్తుందనే సమాచారం గిరిజన ప్రాంత ప్రజల్లో కలకలం రేపింది. మండలంలోని ఊటాయి, కొనపూర్, సాధిరెడ్డి పల్లి పరిధిలోని ఉన్న అటవీ ప్రాంతాన్ని డీఎఫ్‌వో విశాల్, ఎఫ్‌డీవో చంద్రశేఖర్ ఆదేశాలమేరకు నర్సంపేట రేంజ్ పరిధిలోని మూడు చుక్కలపల్లి పరిధిలో ఉన్న కొత్తగూడ రేంజ్ అటవీ ప్రాంతాన్ని కొత్తగూడ రేంజ్ అధికారి వజహత్ నేతృత్వంలో క్షుణంగా పరిశీలించారు. అటవీ జంతువు ఈ ప్రాంతంలో తిరిగినట్టు ఏమైనా పాదముద్రలు ఉన్నాయా? పరిశీలించారు.
ఏ జంతువు అనేది వాటి పాదముద్రల ఆధారంగా గుర్తించే యత్నం చేస్తున్నామన్నారు. అవసరమైతే అనుమానాస్పద ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు పెడతామన్నారు. అలాగే కోనాపూర్,సాధిరెడిపల్లి, ఓటాయి , సమీప గ్రామ ప్రజలు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కొత్తగూడ రేంజర్ వజహత్ సూచించారు. ఈ కార్యక్రమం లో డిఆర్‌వో కరుణ,సెక్షన్ ఆఫీసర్ రాజేష్, బీట్ ఆఫీసర్లు వేణు, సతీష్,తదితరులు పాల్గొన్నారు.