టీమ్ ఇండియా క్రికెటర్, ముంబయి ఇండియన్స్ కీలక ప్లేయర్ తిలక్ వర్మ, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పికిల్ బాల్ ఆడి సందడి చేశారు. స్పోర్ట్స్ ఔట్ ఫిట్స్ లో ఉన్న ఇద్దరూ, సరదాగా కనిపించారు. ఆ తర్వాత బెస్ట్ ఆఫ్ త్రీలో తనను ఓడిస్తే ముంబయి ఇండియన్స్ జెర్సీ వేసుకుంటానని తిలక్ వర్మకు విజయ్ దేవరకొండ ఛాలెంజ్ విసిరారు. అయితే పికిల్ బాల్ మ్యాచ్ లో 2-1తో విజయ్ టీమ్ గెలుపొందింది. అందుకు సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఫుల్ వైరల్ గా మారింది. దీంతో టీమ్ ఇండియా క్రికెటర్స్, సినీ సెలబ్రిటీలు సహా పలువురు స్పందిస్తున్నారు. అదే సమయంలో విజయ్ కూడా కామెంట్ చేశారు. తన అప్ కమింగ్ మూవీ కింగ్ డమ్ లోని హృదయం లోపల సాంగ్ కు రీల్ చేయాలని తిలక్ వర్మ, రాజంగడ్ ను కోరారు. తిలక్ కు లిరిక్స్ అర్థమవుతాయి కనుక అతడినే కొరియోగ్రాఫ్ చేయమని చెప్పారు. హైదరాబాద్ లో జరిగే ప్లేఆఫ్స్ కు వస్తానని, ముంబయి టీమ్ ను ఎంకరేజ్ చేస్తానని తెలిపారు. అయతే ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో ముంబయి టీమ్.. దూసుకుపోతోంది. కాస్త ఆలస్యంగా పుంజుకున్నా.. వరుస మ్యాచుల్లో విజయం సాధిస్తోంది. ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడగా.. లీగ్ దశలో మరో మూడు మ్యాచులు ఆడనుంది. అందులో కనీసం రెండు మ్యాచుల్లో విజయం సాధించినా ఫ్లేఆఫ్స్ కు వెళ్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వాంఖడే స్డేడియంలో గుజరాత్ టైటాన్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఇప్పుడు ఆ మ్యాచ్ కు ముందు తిలక్ వర్మతో కలిసి విజయ్ దేవరకొండ సరదాగా పికిల్ బాల్ ఆడాడు.