Wednesday, December 25, 2024

టిల్లు బ్యూటీతో పవన్‌ రొమాన్స్‌?

ఒక్కోసారి హీరోయిన్స్‌ ఇట్టే ఫేమస్‌ అయిపోతుంటారు. కొందరు హీరోయిన్స్‌ మాత్రం నటిగా కంటే వారు చేసిన పాత్ర గుర్తుండిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది.
ఇపుడు ఉన్న యంగ్ హీరోయిన్స్ లో ఒక్క హీరోయిన్ మాత్రం కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టి ఓ రేంజ్‌లో ఫేమ్ తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు కన్నడ నటి నేహా శెట్టి.
తన ఎంట్రీ టాలీవుడ్ లో సింపుల్ గానే ఇచ్చినప్పటికీ తన కెరీర్ లో బ్రేకింగ్ సినిమా మాత్రం “డీజే టిల్లు” అని చెప్పాలి. ఈ సినిమాలో హీరో సిద్ధూ జొన్నలగడ్డ చేసిన టిల్లు రోల్ కూడా టాలీవుడ్‌లో ఎంత క్లిక్ అయ్యిందో తన పాటుగా రాధికగా నేహా శెట్టి కూడా ఫేమస్ అయ్యిపోయింది. అక్కడి నుంచి తన హాట్ షో మాత్రమే కాకుండా నటిగా కూడా మిడ్ రేంజ్ సినిమాలు చేస్తుంది. కానీ ఇపుడు ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ లో క్రేజీ ఆఫర్ ని కొట్టేసినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టుగా ఫిలింనగర్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ సినిమా కూడా పవన్ కెరీర్‌లోనే భారీ అంచనాలు ఉన్న చిత్రం “ఓజి” అట. పవన్ కళ్యాణ్, సాహో ఫేం సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఈ యంగ్ అండ్ హాట్ బ్యూటీ స్పెషల్ ఐటెం సాంగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇపుడు నడుస్తున్న బ్యాంకాక్‌ షెడ్యూల్‌లోనే ఈమెపై అక్కడే ఈ సాంగ్ ని మేకర్స్ చేస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. అయితే పవన్ ఈ సినిమా షూటింగ్ లో లేరని తెలిసిందే. సో పవన్ తో ఈమెకి స్క్రీన్ స్పేస్ లేదనే చెప్పాలి. బహుశా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీతో ఈ సాంగ్ ఉండి ఉండొచ్చు అని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ హిట్ బ్యూటీ ప్రెజెన్స్ సినిమాలో ఉన్నట్టే తెలుస్తుంది. మరి చూడాలి ఈమె కేవలం ఇమ్రాన్ తోనే ఉంటుందా అనేది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యువ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ నటులు శ్రేయ రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com