Saturday, June 29, 2024

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో.. తీన్మార్ మల్లన్నకు సిపిఎస్ ఉద్యోగుల మద్ధతు

  • ఉద్యోగులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి
  • గెలిపించాలని సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పిలుపు

నల్లగొండ-, ఖమ్మం, -వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు సిపిఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులు బహిరంగ మద్ధతు పలికారు. పాత పింఛన్ విధానాన్ని (ఓపిఎస్) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోనే స్పష్టత ఇవ్వడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. శుక్రవారం జరిగిన తమ యూనియన్ సమావేశంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ తన సంపూర్ణ మద్ధతును రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి ప్రకటించిందని ఆయన తెలిపారు.

సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయ కుటుంబాల్లోని పట్టభద్రులు ‘సిపిఎస్ రద్దు – పాత పెన్షన్ పునరుద్ధరణ’ స్లోగన్‌తో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న జర్నలిస్టుగా ఉన్న సమయంలోనే ఓల్డ్ పెన్షన్ స్కీంకు మద్దతు పలికారని, ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఈ డిమాండ్‌కు ఆచరణ రూపం ఇవ్వడానికి కృషి చేస్తారన్న నమ్మకంతో తాము మద్ధతు పలకాలని నిర్ణయించుకున్నట్లు స్థితప్రజ్ఞ తెలిపారు.

సిపిఎస్ ఉద్యోగి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ పత్రాలు
ఈ సమావేశంలో భాగంగా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్‌లో చనిపోయిన సిపిఎస్ ఉద్యోగి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ పత్రాలను వారి కుటుంబసభ్యులకు రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ చేతుల మీదుగా అందించారు. సిపిఎస్ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్‌లో ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వానికి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విధంగా ఫ్యామిలీ పెన్షన్‌ను సిపిఎస్ ఉద్యోగుల ఉండేలా ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించారు. సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం సమస్యనే కాకుండా భవిష్యత్‌లో సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొనే ప్రతి సర్వీస్ సంబంధిత సమస్య లను సిపిఎస్ సంఘమే పరిష్కరించాలని వారు తీర్మానించారు. ఈ సమావేశంలో 33 జిల్లాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్‌లు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular