Saturday, February 22, 2025

తిరుపతి పోలీసుల అదుపులో టాలీవుడ్ హీరో – నన్ను వేధిస్తున్నారు

సినీ నటుడు మంచు మనోజ్‌ను తిరుపతి పోలీసులు సోమవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణుతో కుటుంబ పరమైన, ఆస్తి పరమైన తగాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వారి మధ్య కలహాలు హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్, అలాగే కోర్టు మెట్లు వరకు వెళ్ళింది. మనోజ్ వ్యవహరిస్తున్న తీరుపై అటు మోహన్ బాబు.. అలాగే సోదరుడు విష్ణు వ్యవహరిస్తున్న తీరుపై మనోజ్ మండిపడటం తెలిసిందే. గత రెండు నెలలుగా టీవీ సీరియల్‌గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి గతంలో తన అనుచరులతో వెళ్లడం గందరగోళానికి దారి తీసింది. తిరుపతి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అప్పటికి ముగిసింది. “1000 కోట్ల బడ్జెట్.. బొమ్మ బాగుండాలిగా .. కన్నప్ప మూవీపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్ ” అయితే తాజాగా మరోసారి తిరుపతి చేరుకొన్న మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆయనను బాకారావుపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.

తిరుపతి ఘాట్ రోడ్, ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాలలో పోలీసులు (Police) సోమవారం అర్ధరాత్రి గస్తీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండటాన్ని చూసి.. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం బౌన్సర్లు మనోజ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన రిసార్ట్స్ నుంచి పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. ‘నన్ను అరెస్టు చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు.. నన్ను అరెస్టు చేయండి..’ అంటూ మంచు మనోజ్ అన్నారు. దీంతో ‘మేము అరెస్టు చేయడానికి రాలేదు.. రాత్రి పూట హైవేపైన, ఘాట్ రోడ్ ప్రాంతంలో బౌన్సర్లు ఉండటంతో ఎవరు.. అన్న వివరాలు అడిగి తెలుసుకున్నాం’ అని భాక్రా పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నారు. ఈ క్రమంలో పీఎస్ దగ్గర మెట్లపై మంచు మనోజ్ కూర్చున్నారు. తాను రిసార్ట్స్‌లోఉంటే ఎందుకు వేధిస్తున్నారంటూ మనోజ్‌ పోలీసులను అడిగారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com