- ఉచిత బస్సు ప్రయాణంతో విద్యార్థులు సంతోషం
- ఆసక్తికరమైన ట్వీట్ చేసిన సిఎం రేవంత్ రెడ
ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం గురించి మరోసారి సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణంతో బాలికలు పాఠశాలకు వెళ్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ‘సిద్దిపేట జిల్లా మగ్దుంపూర్ పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలు ఊరికి కి.మీ.
దూరంలో ఉన్న స్కూల్‌కు రూపాయి ప్రయాణఖర్చు లేకుండా పాఠశాలకు వెళ్లగలుగుతున్నారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సెక్కి ఉచితంగా స్కూల్‌కు వెళ్లగలుగుతున్నామని ఆధార్ కార్డులు చూపిస్తూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని సిఎం రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ బాలికలు చేతిలో ఆధార్ కార్డులు పట్టుకొని ఉన్న ఫొటోలు వైరల్‌గా మారడంతో సిఎం రేవంత్ ట్వీట్ చేశారు.