Wednesday, April 2, 2025

AP Weather Report: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. అక్కడ పిడుగులు పడే ఛాన్స్

పొలాల్లో, చెట్లు, టవర్స్ క్రింద ఉండొద్దని సూచన

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ చెప్పారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఆయన హెచ్చరించారు.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో బుధవారం 26 వ తేదీ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ప్రకటించింది. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, నంద్యాల వైయస్ఆర్, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇక గురువారం పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ స్పష్టం చేసింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com