Thursday, May 8, 2025

Today Gold Rate: మళ్లీ బంగారం ధరలకు రెక్కలు

క్రమంగా పెరుగుతున్న పసిడి ధరలు

బంగారం ధరలు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు పసిడి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న టైంలో క్రమంగా గోల్డ్ రేట్ పైపైకి వెళ్తోంది. గతంలోను 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 80 వేలకు చేరిన సంగతి తెలిసిందే. ఐతే ఆ తరువాత పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ 70 వేలకు చేరువైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు గడిచిన కొన్ని రోజుల నుంచి బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దీంతో 10 గ్రాముల పసిడి ధర మళ్లీ 73వేలకు చేరుకుంది.

శనివారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,160
24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,260 గా ఉంది

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,160
24 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 73,260 గా ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,160
24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260 గా ఉంది.

న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,310
24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,410 గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,160
24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260 గా ఉంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 67,160
24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260 గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,810
24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,980 గా ఉంది.

ఇక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు సైతం పెరిగాయి. శుక్రవారం కిలో వెండిపై 100 రూపాయల వరకు పెరిగింది. దీంతో హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర గరిష్టంగా 98,600 రూపాయలుగా ఉంది. రాబోవు రోజుల్లోను బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com