హమ్మయ్యా బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ గురువారం రోజున కాస్త బ్రేక్ పడింది. 2024 అక్టోబర్ 24వ తేదీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం.. రూ.550 తగ్గింది. ఇక 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73 వేలు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79 వేల 620గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72 వేల850గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79 వేల 470గా ఉంది.
ఇక హైదరబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72 వేల 850గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79 వేల 470గా ఉంది. వైజాగ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72 వేల 850గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79 వేల 470గా ఉంది.
అటు వెండి ధరల విషయానికి వస్తే.. ఏకంగా రూ. 2 వేలు తగ్గింది. దీంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లలో కేజీ వెండి ధర రూ. 1,10, 000గా ఉండగా.. ముంబై, ఢిల్లీలలో రూ. 1, 02, 000గా ఉంది.