బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కీలక నేతలతో తన ఫామ్‌హౌస్‌లో సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే అభ్యర్థిని ఈ సమావేశంలో కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీశ్ రావు కూడా హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ వస్తుంది. అయితే పాతవారిని రెన్యువల్ చేస్తారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే సమావేశంలో పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై కూడా చర్చించనున్నారు.