టోల్ ఛార్జీలు పెరిగాయి
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై (ఓఆర్‌ఆర్) టోల్ చార్జీలు మరోసారి పెరిగాయి. చడీచప్పుడు లేకుండా.. ఎక్కడా ప్రచారం కాకుండా ప్రతిపాదనలను ఆమోదించేశారు. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను ఐఆర్‌బీ సంస్థ రెండేండ్ల క్రితం 30 ఏండ్ల కాలానికి లీజు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్‌ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్ ధరలను పెంచింది.
దీని ప్రకారం కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచింది. దీంతో ప్రస్తుతం కిలోమీటర్‌కు రూ.2.34గా ఉన్న చార్జీలు రూ.2.44కు పెరిగాయి.
అదేవిధంగా మినీబస్, ఎల్‌సీవీలకు కిలోమీటర్‌కు 20 పైసలు వడ్డించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రూ.3.77 నుంచి రూ.3.94కు చేరింది. 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచింది. భారీ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.15.09 నుంచి రూ.15.78కు పెంచింది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1న టోల్‌చార్జీలను సంస్థ పెంచుతూ వస్తున్నది. ఇందులో భాగంగా గతేడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. తాజాగా మరోసారి చార్జీలను పెంచింది. వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై టోల్ ఛార్జీలను ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ పెంచింది. కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
విజయవాడ్ రూట్‌లో తగ్గింపు
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ఫుల్ రష్ గా ఉంటుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండటంతో రోజుకూ వేల వాహానాలు వెళ్తుంటాయి. అయితే ఈ రహాదారి గుండా ప్రయాణించే వాహనాదారులకు ఎన్‌హెచ్‌ఏఐ గుడ్న్యూస్ చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్ హెచ్ ఏ ఐ సవరించిన టోల్ చార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే మార్చి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత వాహనదారుల నుంచి తగ్గిన చార్జీలు వసూలు చేయనున్నారు. 2026 మార్చి 31వ తేదీ వరకు తగ్గిన టోల్ చార్జీలు అమల్లో ఉంటాయి.
మొత్తం మూడు టోల్ ప్లాజాలు
విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి 65 మీద తెలంగాణలో చౌటుప్పల్ మండలం లో పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి మండలంలో కొర్లపహాడ్ టోల్ ప్లాజా, ఆంధ్రప్రదేశ్లో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వ్యాను, జీపు, కార్లకు ఒకవైపు జర్నీకి 15 రూపాయలు, రెండు వైపులా జర్నీకి 30 రూపాయలు తగ్గించారు. తేలికపాటి కమర్షియల్ వాహనాలకు ఒకవైపు జర్నీకి 25 రూపాయలు, రెండు వైపులా జర్నీకి 40 రూపాయలు.. ట్రక్కులు బస్సులకు ఒకవైపు జర్నీకి 50 రూపాయలు, రెండువైపుల జర్నీకి అయితే 75 రూపాయల వరకు NHAI తగ్గించింది. ఏపీలోని చిల్లకల్లు నందిగామ టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు ఒకవైపు జర్నీకి ఐ5 రూపాయలు రెండు వైపులా జర్నీ అయితే 10 రూపాయల చొప్పున తగ్గించారు. 24 గంటల లోపు వాహనదారులు తెలుగు ప్రయాణం చేసినట్లయితే టోల్ చార్జీలు 25 శాతం రాయితీ లభిస్తుంది.
టోల్ చార్జీలు తగ్గడానికి కారణం ఇదే..
జిఎంఆర్ సంస్థ 1740 కోట్లతో బి ఓ టి పద్ధతిలో యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని నందిగామ వరకు 181 కిలోమీటర్లను నాలుగు లైన్ల రహదారిని నిర్మించింది. 2012 డిసెంబర్లో హైదరాబాద్ విజయవాడ రహదారిపై టోల్ ప్లాజా ల వద్ద చార్జీల వసూళ్లు ప్రారంభమయ్యాయి. గతేడా అది జూన్ 31 వరకు జిఎంఆర్ సంస్థ రహదారి నిర్వహణను టోల్ చార్జీలను పర్యవేక్షించింది. 2024 జూలై ఒకటో తేదీ నుంచి ఎన్ హెచ్ ఏ ఐ ఏజెన్సీల ద్వారా టోల్ వసూలు చేస్తోంది. గతంలో ఒప్పందం ప్రకారం జిఎంఆర్ సంస్థ ప్రతి ఏడాది టోల్ చార్జీలు పెంచేది. ప్రస్తుతం ఎన్ హెచ్ ఎ ఐ టోల్ చార్జీలను కలెక్ట్ చేస్తున్నందున వాహనదారులపై భారాన్ని తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.