తెలంగాణ ప్రభుత్వం ముందు ప్రముఖ నటి సమంత ఓ ప్రత్యేకమైన డిమాండ్ పెట్టారు. టాలీవుడ్ లోను కేరళ తరహా కమిటీ వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇన్స్టా గ్రామ్ లో సమంత కీలక పోస్టును పెట్టారు. కేరళలో సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC సంస్థను ఈ సందర్బంగా సమంత అభినందించారు. ఇదే బాటలో టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ ది వాయిస్ ఆఫ్ ఉమెన్ నడవాలని ఆమె ఆకాంక్షించారు.
తెలుగు చిత్ర పరిశఅరమలోనూ ఇలాంటి కమిటీ వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సమంత. దీనివల్ల సినీ ఇండస్ట్రీలో భద్రమైన వాతావరణంలో మహిళలు పనిచేసేందుకు అవకాశం దొరుకుతుందని సమంత అభిప్రాయపడ్డారు. సమంత డిమాండ్ తో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడిందన్న చర్చ జరుగుతోంది. సమంత కూడా సినీ పరిశ్రమలో ఏమైనా సమస్య లేదుర్కొందా అంటూ ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కేరళ తరహాలో కమిటీ ఏర్పాటు చేస్తే తెలుగు చిత్ర పరిశ్రమలోను ఎన్నో సంఘటనలు బయటకు వస్తాయాన్న వాదన సైతం వినిపిస్తోంది.