Wednesday, April 2, 2025

టాలీవుడ్ అంతా అతని చర్చే

తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఓ పక్క సమ్మర్‌ హీట్‌తో వేడెక్కుతుంటే మరో పక్క పొలిటికల్‌ లీడర్లు అదే విధంగా సినీ ప్రముఖ హీరోలంతా కూడా ఎన్నికల హీట్‌తో సతమతమవుతున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినీ తారలంతా కూడా ఒక్కొక్కరు ఒక్కో పార్టీ తరపున ఎన్నికల బరిలో పాల్గొంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎటు చూసినా సినీ గ్లామరే కాస్త ఎక్కువగా కనబడుతుంది. ఇకపోతే వీరు నిలబడ్డ నియోజకవర్గాల్లో వీరి గెలుపెంతవరకు అన్న విషయం పక్కన పెడితే వీళ్ళు చేసే హడావిడి మాత్రం అంతా ఇంతా లేదని చెప్పాలి.

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌లు ఒక ఎత్తైతే..పిఠాపురం ఎన్నిక మ‌రో ఎత్తులా మారింది. అక్క‌డ గెలుపు గీత‌దా? ప‌వ‌న్ దా? అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కోట్లాది మంది ప్ర‌జ‌లు గెలుపు గుర్రం ఎక్కేది ఎవ‌రంటూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీల ప‌రంగా చూస్తే గెలుపుపై ఎవ‌రికి వారు ధీమాగా ఉన్నారు. మ‌రి టాలీవుడ్ మాటేంటి? అంటే అక్క‌డా ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. చిన్న చిన్న ఆర్టిస్టుల నుంచి అగ్ర స్థాయి న‌టుల వ‌ర‌కూ.. ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు, టెక్నిషియ‌న్లు ఇలా అంతా పిఠాపురంలో జ‌య‌కేత‌నం ఎగ‌రేసేది? ఎవ‌రంటూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ లు కూడా లేక‌పోవ‌డంతో టాలీవుడ్ అంతా పిఠాపురం రాజ‌కీయంతో నిండిపోయింది. ఇప్పుడే సినిమా ఆఫీస్ లో చూసినా ఇదే టాపిక్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇండ‌స్ట్రీలో బేసిక్ గా ప‌వ‌న్ ఫాలోవ‌ర్స్ ఎక్కువ‌గా ఉంటారు కాబ‌ట్టి అత‌నిదే గెలుప‌ని భావిస్తుండ‌గా అదే సామాజిక వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్నవంగా గీత బ‌లహీన వ‌ర్గాల్లో బ‌లంగా ఉన్నార‌ని…కాపు క‌మ్యునిటీ నుంచి ఆమెకి ఓటు శాతం పెరుగుతుంద‌నే డిస్క‌ష‌న్స్ ఇండ‌స్ట్రీలో జోరుగా సాగుతున్నాయి.

ఎన్నిక‌ల స్ట్రాట‌జీ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లో వ‌చ్చిన మార్పుల్ని కూడా అంతే సునిశితంగా ప‌రిశీలిస్తున్నారు.2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన స‌మ‌యంలో ప‌వ‌న్ ఎలా ఉండేవారు? ఇప్పుడెలాంటి స్ట్రాట‌జీతో పోటీలో దిగుతున్నారు? ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ లో వ‌చ్చిన మార్పులు..ఆయ‌న స్పీచ్ ల‌పై వాడి వేడి చ‌ర్చ సాగుతోంది. అలాగే వంగా గీత సైలెంట్ రాజ‌కీయం వెనుక వ్యూహం ఏంటి? అన్న‌ది ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌కు దారి తీస్తుంది. అయితే ఇండ‌స్ట్రీ నుంచి మెజార్టీ వ‌ర్గం ప‌వ‌న్ గెల‌వాలి అని బ‌లంగా కోరుకుంటున్నారన్న‌ది వాస్త‌వం. ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఇప్ప‌టికే ప‌వ‌న్ కోసం దాదాపు మెగా ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌..వ‌దిన‌మ్మ సురేఖ కూడా ప‌వ‌న్ తరుపున పిఠాపురంలో ప్ర‌చారం చేస్తున్నారు. వీళ్లంద‌రికంటే ముందుగా జ‌బ‌ర్దస్త్ క‌మెడియ‌న్లు…సీరియ‌ల్ ఆర్టిస్టులు కూడా ప‌వ‌న్ కం కూట‌మి త‌రుపున ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. వీళ్లెవ్వ‌ర్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారం కోసం పిల‌వ‌లేదు. అంతా స్వ‌చ్ఛ‌దంగా అభిమానంతో వ‌చ్చి ప్ర‌చారం చేసిన వారే.

పవన్‌కు మెగా అండదండలు

ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉత్కంఠంగా మారుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఫలితాలు తారుమారు అవుతాయి అనే విధంగా కూడా కామెంట్ వస్తూ ఉన్నాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తప్పకుండా గెలవాలి అని ఆయన కుటుంబ సభ్యులు ఏ స్థాయిలో కోరుకుంటున్నారో ఈపాటికే అర్థమయింది. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఒక విధంగా ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ స్థాయిలోనే పవన్ కు విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో తన సపోర్ట్ అందించాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నట్లు ఇదివరకే కథనాలు వచ్చాయి. చిరంజీవి తన తమ్ముడికి సపోర్టు ఇచ్చినప్పటికీ పాలిటిక్స్ అనే అంశానికి ఆయన కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తల్లి సురేఖ తో కలిసి పవన్ ను పిఠాపురంలో ప్రత్యేకంగా కలుసుకున్నారు. వీరితో పాటు అల్లు అర్జున్ కూడా తన బెస్ట్ విషెస్ ను అందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ రాగానే అక్కడికి వేలాదిమంది జనసైనికులు వచ్చారు. ఇక వారికి ఎంతో ఆప్యాయంగా అభివాదం తెలిపిన రాంచరణ్ తన సపోర్ట్ ఎల్లప్పుడూ బాబాయ్ కి ఉంటుంది అని చెప్పగానే చెప్పేసాడు.

పవన్ కళ్యాణ్ చిరంజీవి భార్య సురేఖ గారిని తల్లిగా భావిస్తూ ఉంటాడు. ఆమె గతంలో పార్టీ కోసం సహాయం కూడా చేశారు. ఇక అల్లు అరవింద్ కూడా సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ వైపు నిలబడినట్లుగా అర్థమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ కనిపించడంతో ఆ ఫోటోలు కూడా ఫ్యాన్స్ కు మంచి కిక్ అయితే ఇస్తున్నాయి. అయితే ఒక ఫొటోలో పవన్ కళ్యాణ్ కాలికి కాస్త గాయం అయినట్లు కూడా అనిపిస్తుంది. ఒక ఫోటోలో పవన్ కాలికి కట్టు కట్టినట్లు ఉంది. అయితే ఎక్కడ పవన్ దాన్ని హైలెట్ చేసుకోలేదు. మొత్తానికి పవన్ కు మెగా ఫ్యామిలీ నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. మరి ఈ ప్రభావం రాజకీయంగా ఆయనకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com