సినిమా ఇండస్ట్రీ బాగుపడాలన్నదే మా ఆకాంక్ష
తెలంగాణ అభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి
షూటింగ్స్ కోసం హాలీవుడ్, బాలీవుడ్ వాళ్లు హైదరాబాద్ కు వొచ్చేలా చర్యలు
డ్రగ్స్ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి
సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
సినీ ప్రముఖులతో భేటీలో సిఎం రేవంత్ రెడ్డి వెల్లడి
ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు
తెలుగు చిత్రసీమను ప్రపంచస్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దుదాం ఇందుకోసం కలసి పనిచేద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్దిలో మీరూ భాగస్వాములు కావాలని చిత్ర పరిశ్రమను ఆహ్వానించారు. సినీ పరిశ్రమలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన సూచనలు చేశారు. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంత్రివర్గ ఉప సంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది. రానున్న రోజుల్లో ఇండస్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అదనపు షోల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, టికెట్ రేట్ల పెంపుపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది.
సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
కాగా తెలుగు సినిమా ఇండస్టీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. సినిమా పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు సిఎం రేవంర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఇండస్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి సర్కార్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్టీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణ, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని సిఎం సూచించారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని ముఖ్యమంత్రి సినీ పెద్దలకు సూచించారు. కాగా ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశం కగా, ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. సమావేశం ప్రారంభంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు. అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు.
‘ప్రభుత్వం ఇండస్టీత్రోనే ఉంది. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలి. ఆలయ పర్యటకం, ఎకోటూరిజంను ప్రచారం చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్టీ సహకరించాలి. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటాం‘ అని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను ప్రముఖులు మా దృష్టికి తెచ్చారు. అనుమానాలు, అపోహలు, ఆలోచనలు పంచుకున్నారు. మా ప్రభుత్వం ఇండస్టీక్రి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశం. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది. పుష్ప సినిమాకు పోలీసు గ్రౌండ్ ఇచ్చాం. తెలుగు ఇండస్టీక్రి ఒక బ్రాండ్ సృష్టించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఐటీ, ఫార్మాతో పాటు మాకు ఈ రంగం కూడా ముఖ్యమే. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును తీసుకొచ్చాం. ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండాలని దిల్ రాజును ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
నగరంలో పెద్ద సదస్సులు నిర్వహించి ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇండస్టీక్రి ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. ఆ వారసత్వాన్ని మేమూ కొనసాగిస్తాం. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం‘ అని సీఎం వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని.. ఆ మేరకు సినీ ప్రముఖులకు భరోసా ఇచ్చినట్లు ఆ తర్వాత ముఖ్యమంత్రి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం మూలధన పెట్టుబడులు కల్పిస్తేనే మన సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేదే మా కోరిక. యూనివర్సల్ లెవల్‌లో స్టూడియో సెటప్‌లు ఉండాలి‘ అని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కు వొచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారు. ‘తెలంగాణలో అద్భుతమైన పర్యటన ప్రదేశాలున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందరు సీఎంలూ పరిశ్రమను బాగానే చూసుకున్నారు.
ఈ ప్రభుత్వం కూడా మాకు ప్రోత్సాహం అందిస్తోంది. దిల్‌రాజును ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించడం హర్షణీయం అని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. ‘నేను చిన్నప్పటి నుంచి పరిశ్రమను చూస్తున్నా. హైదరాబాద్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్ ఘటన మమల్నీ ఎంతగానో బాధించింది. ఎన్నికల ఫలితాల మాదిరిగానే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుంది. సినిమా రిలీజ్‌లో పోటీ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాలు విడుదలవుతున్నందున విస్తృతంగా ప్రమోషన్లు చేస్తున్నాం అని మురళీ మోహన్ అన్నారు. ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వొచ్చింది. నెట్‌ప్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండాలి. నగరాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్‌గా చేయాలనేది మా కల అని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అన్నారు.