Tuesday, May 13, 2025

భారత ఐటీ రంగంలో టాప్ సాలరీ సీఈఓ

హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ సీఈఓ సి. విజయకుమార్ భారతదేశ ఐటీ రంగంలో అత్యధిక జీతం తీసుకుంటున్నబాస్ గా రికార్డ్ సృష్టించారు. 2023–-24 ఆర్ధిక సంవత్సరంలో ఆయన ఏడాది జీతం రూ.84.16 కోట్లు. భారతీయ ఐటీ కంపెనీల్లో ఇప్పటివరకూ ఇదే అత్యధిక వేతనం. విజయకుమార్ ఆదాయం 2022–-23 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. ఏడాదిలో 190.75 శాతం పెరిగిన విజయకుమార్ జీతం విజయకుమార్ జీతం ఏడాది కాలంలో 190.75 శాతం పెరిగింది. ఈ నెల 22న కంపెనీ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాదిలో కంపెనీ సాధించిన అభివృద్ధిలో విజయకుమార్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన వేతనాన్ని భారీగా పెంచారు. దాంతో, ఆయన జీతం 28 కోట్ల రూపాయల నుంచి 84 కోట్లకు దూసుకుపోయింది.

విజయకుమార్ బేసిక్ సాలరీ రూ. 16.39 కోట్లు, బోనస్ రూ. 9.53 కోట్లు, లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్ క్యాష్ కంపోనెంట్ రూ. 19.74 కోట్లు, షేర్ల రూపంలో రూ. 38.15 కోట్లు, బెనిఫిట్స్, అలవెన్స్ తో పాటు ఇతర అవసరాలకు రూ. 33 లక్షలు. ఇప్పుడు సీఈఐ విజయకుమార్ వేతనం సగటు హెచ్ సీ ఎల్ ఉద్యోగి జీతం కంటే 707.46 రెట్లు ఎక్కువ. రూ. లక్ష కోట్లు దాటిన హెచ్ సీ ఎల్ ఆదాయం హెచ్ సీ ఎల్ కంపెనీ ఆదాయం ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్లు దాటింది. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 2 లక్షల 25 వేలు దాటిందని ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక తెలిపింది. 60 దేశాల్లో సంస్థ కార్యకలాపాలను విస్తరించింది.ఈ మేరకు విజయకుమార్ షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. కంపెనీ రెవెన్యూ 13.7 శాతం పెరిగింది. మరో వైపు సర్వీస్ రంగంలో 15.8 శాతం పెరుగుదల నమోదు చేసినట్టుగా ఆ కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది.

టెక్నికల్ ఇంజనీర్ నుంచి హెచ్ సీ ఎల్ సీఈఓగా… హెచ్ సీ ఎల్ టెక్నాలజీ సంస్థలో 1994 లో టెక్నికల్ ఇంజనీర్ గా ఆయన చేరారు. కంపెనీలో పలు హోదాల్లో ఆయన పనిచేశారు. 2016 అక్టోబర్ లో ఆయన కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సంస్థను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తమిళనాడులోని పీ ఎస్ జీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో ఆయన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో డిగ్రీ పట్టా పొందారు. రెండో స్థానంలో సలీల్ పారేఖ్ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న వారిలో రెండో స్థానంలో ఉన్నారు ఇన్ఫోసిస్ సీఈఐ సలీల్ ఫారేఖ్. ఆయన వార్షిక ఆదాయం రూ. 66.25 కోట్లు. మూడో స్థానంలో విప్రో సీఈఓ శ్రీని పల్లియా నిలిచారు. ఆయన వేతనం ఏడాదికి 50 కోట్లు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com