పరామర్శించిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం పరామర్శించారు. బంజారాహిల్స్ లోని మధుయాష్కీ నివాసానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి అనసూయ మృతి, ఆమె మరణానికి గల కారణాలను మధుయాష్కీని అడిగి తెలుసుకున్నారు.
అనసూయ చిత్రపటానికి నివాళులర్పించిన భట్టి విక్రమార్క తన సంతాపాన్ని ప్రకటించారు. మధుయాష్కి గౌడ్‌కి, ఆయన కుటుంబ సభ్యులకు భట్టి తన సానుభూతిని తెలియజేశారు.