Monday, May 12, 2025

‘మిస్టర్ సైకో రాం నీ సైకో చేష్టలతో’ అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి పోయావు

టిపిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమ్మోహన్ రెడ్డి
రాష్ట్రంలోకి అదానీ రాకుండా తాము రెడ్ సిగ్నల్ ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తుందంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన విమర్శలకు టిపిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమ్మోహన్ రెడ్డి బుధవారం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ సైకో రాం నీ సైకో చేష్టలతో అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి పోయారని, ఇప్పుడు ప్రతిపక్షంలో నుంచి పాగల్ ఖానాకు పోయేటట్టున్నావ్ అని ఆయన ఎద్దేవా వేశారు.

అదానీ నువ్వు చెప్పినట్టు మీ హయాంలో రాష్ట్రంలోకి రానివ్వకుండా రెడ్ లైట్ వేస్తే మరి మీ గుమాస్తా పేపర్లో నాడు అదానీని హైదరాబాద్ తెచ్చింది నువ్వే అని హెడ్ లైన్స్ ఎందుకు రాయించుకున్నావ్ అని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ హయాంలో అదానీ -ఎల్బిట్ సిస్టమ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మానవ రహిత విమాన ప్రధాన విడిభాగాల తయారీ ప్లాంట్‌కు సంబంధించి ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన షేర్ చేశారు. ఇందులో ఈ ప్రాజెక్టు కెటిఆర్ దావోస్ సమావేశ ఫలితమే అని ఆయన ప్రచురించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com