Wednesday, December 25, 2024

హైడ్రాతో పడిపోయింది నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు…. బిఆర్‌ఎస్ పార్టీ గ్రాఫ్ మాత్రమే….

  • కెటిఆర్ పథకం ప్రకారమే రియల్ ఎస్టేట్
  • వ్యాపారుల పేరుతో మీటింగ్ పెట్టారు
  • టిపిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమ్మోహన్ రెడ్డి

హైడ్రాతో పడిపోయింది నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదనీ, బిఆర్‌ఎస్ పార్టీ గ్రాఫ్ మాత్రమేనని టిపిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కెటిఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను సామ తిప్పికొట్టారు. కెటిఆర్ పథకం ప్రకారమే రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో మీటింగ్ పెట్టారని సామ రాంమ్మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సామ రాంమ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముక్కు, ముఖం తెలియని వారు రియల్టర్లు అని చెబుతున్నారన్నారు.

గత సంవత్సరం పుట్టిన రియల్ ఎస్టేట్ సంఘం ఇదని, పార్టీ నేతలను కలుపుకొని రియల్ ఎస్టేట్ మీటింగ్ అని కెటిఆర్ కలరింగ్ ఇచ్చారని ఆయన విమర్శించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్‌లు పెరిగాయన్నారు. హైడ్రా చెరువు కబ్జాలను అడ్డుకుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదని, బిఆర్‌ఎస్ నాయకుల రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. హైడ్రా వచ్చిన తరువాత కూడా హైదరాబాద్‌లో నెల నెలా రిజిస్ట్రేషన్లు పెరిగిన మాట వాస్తవమని, స్క్వేర్ యార్డ్ నివేదిక కూడా ఇదే చెప్పిందని సామ తెలిపారు.

తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కెసిఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. కెటిఆర్ పాదయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు ఇస్తే తప్పేంటన్నారు. పనులు సరిగ్గా చేయకుంటే కంపెనీలపై చర్యలు ఉంటాయన్నారు. కార్పొరేట్ పెట్టుబడులను స్వాగతిస్తామని, వనరులు దోచుకుంటామంటే వ్యతిరేకిస్తామని సామ రాంమ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com