Friday, November 15, 2024

వాహనదారులకు బిగ్ షాక్ పెరగనునన్న ట్రాఫిక్ చలాన్లు

సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలకం నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుత చలాన్లపై 5,6 రెట్లు పెంచి పలు నిబంధనల్లో పలు మార్పులు చేసేందుకు యోచిస్తోంది.

ఇష్టారీతిన వాహనాలు నడిపేవారికి ముక్కు తాడు వేసేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ వారిపై జరిమానాలు భారీగా విధించేలా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారట, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ 18,33,761 మందికి జరిమానాలు విధించారు.

ఇక ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు, శిక్షలు విధించినా కొందరు మందు బాబులు మాత్రం మారడం లేదు. మద్యం తాగి పదేపదే దొరుకుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 31వ తేదీ వరకు 7 నెలల వ్యవధిలో వెస్ట్‌జోన్ ట్రాఫిక్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్‌నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 5 వేల 540 మంది పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.

మరోవైపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హైదరాబాద్ లో నేడు ఉదయం 4 నుంచి రాత్రి11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇస్కాన్ టెంపుల్, అబిడ్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular