Saturday, November 16, 2024

హైదరాబాద్ లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

వినాయక నిమజ్జనం నేపధ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం నుంచి మొదలు బుధవారం ఉదయం వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ఈ నెల 17, 18 తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు సిటీ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. బాలాపూర్‌ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌ పై కట్టమైసమ్మ ఆలయం వద్ద ప్రధాన ఊరేగింపు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుందని సీపీ చెప్పారు. ఓల్ట్ సిటీలోని కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌, మహబూబ్ నగర్ ఎక్స్‌ రోడ్, ఫలక్‌ నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌ గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్‌ ఎక్స్‌ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్‌ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వైపు శోభాయాత్ర సాగుతుందని సీవీ ఆనంద్ చెప్పారు.

ఇక దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే వినాయక శోభాయాత్రలను ఐఎస్‌ సదన్, సైదాబాద్, చంచల్‌ గూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్‌ రోడ్డులో కలుస్తోంది. అక్కడి నుంచి మూసారాంబాగ్‌, అంబర్‌ పేట్‌ వైపు వెళ్తాయి. తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఓయూ దూర విద్యాకేంద్రం రోడ్డు, అడిక్‌ మెట్‌ వైపు వెళ్లి విద్యానగర్‌ మీదుగా ఫీవర్‌ ఆసుపత్రి వద్దకు ఊరేగింపు చేరుతుందని పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. అటు సికింద్రాబాద్‌ నుంచి ఊరేగింపుగా వచ్చే గణేష్ శోభాయాత్ర వాహనాలను సంగీత్‌ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్‌ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్‌ బండ్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డుకు మళ్లిస్తారు. చిలకలగూడ కూడలి నుంచి గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నారాయణగూడ ప్లైఓవర్, వై జంక్షన్, హిమాయత్‌నగర్‌ నుంచి లిబర్టీ వైపు మళ్లిస్తారు.

మరోవైపు ఉప్పల్‌ నుంచి వచ్చే వినాయక శోభా యాత్రలు.. రామంతాపూర్, శ్రీరమణ జంక్షన్, ఛే నంబరు, తిలక్‌నగర్, విద్యానగర్‌ జంక్షన్, ఫీవర్‌ ఆసుపత్రి, బర్కత్‌పుర జంక్షన్ మీదుగా వెళ్లి నారాయణగూడ వైఎంసీఏ కూడలికి చేరుకుంది. ఈ విగ్రహాలు ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో కలపనున్నారు. ఇటు ఎర్రగడ్డ నుంచి వచ్చే శోభాయాత్రలు ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌ వద్ద చేరి, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు చేర్చనున్నారు. టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహాలను మాసబ్‌ ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్‌ జంక్షన్, ఇక్బాల్‌ మినార్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటుంది. టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, వోల్గా హోటల్‌ ఎక్స్‌రోడ్, గోషా మహల్, మాలకుంట కూడలి మీదుగా వెళ్లి ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular