కోలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా ”కింగ్స్టన్” మూవీతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఫస్ట్ సీ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో ‘బ్యాచిలర్’ తరువాత మరోసారి దివ్యభారతి, జీవీ ప్రకాష్ జంటగా కనిపించబోతున్నారు. ఈ మూవీకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా అంచనాలను అమాంతం పెంచింది. తమిళ, తెలుగు భాషల్లో మార్చ్ 7న రిలీజ్ చేయబోతున్నారు. గంగ ఎంటర్‌టైన్ మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ”కింగ్‌స్టన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల, మరో డైరెక్టర్ వెంకీ అట్లూరి, మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ ‘కింగ్‌స్టన్’ ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ఇలాంటి స్పెక్టాకులర్ విజువల్స్ అందించినందుకు డైరెక్టర్ కమల్ కు అభినందనలు. ట్రైలరే ఇలా ఉంటే, ఇంకా సినిమా ఎలా ఉంటుందో అనే ఆతృత పెరిగింది. నేను ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ‘కింగ్‌స్టన్’ మూవీ మార్చ్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఇది ఫస్ట్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్. సినిమా ఖచ్చితంగా బాగుండాలని, బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దివ్య మీరు తెలుగు చాలా బాగా మాట్లాడారు. మీలాంటి అమ్మాయిలు క్యూట్ క్యూట్ గా అలాంటి తప్పులు చేస్తే మాలాంటి అబ్బాయిలకి బాగా నచ్చుతుంది. మీ ఎఫర్ట్స్ కి మెచ్చుకోవాలి. నాకు బాగా క్లోజ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మహేశ్వర్ రెడ్డి ఈ మూవీని తీసుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి, ఆయనకు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.