Wednesday, September 18, 2024

హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి రేవంత్ రెడ్డి నిర్ణయం

సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు
వలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్‌లను నియమించుకోవాలి
హోంగార్డ్ తరహాలోనే ట్రాన్స్‌జెండర్లకు ఈ విధులు అప్పగించాలి
విధుల్లో ఉండే ట్రాన్స్‌జెండర్‌లకు ప్రత్యేక యూనిఫాం ఉండాలి
అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సిఎం రేవంత్

హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్‌లను వలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్ ప్రస్తుతం సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లవుతుందని సిఎం రేవంత్ సూచించారు. వలంటీరులుగా ఆసక్తిగా ఉన్న ట్రాన్స్‌జెండర్‌ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. వారం, పది రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని ఆయన చెప్పారు. విధుల్లో ఉండే ట్రాన్స్‌జెండర్‌లకు ప్రత్యేక యూనిఫాం కూడా ఉండాలని అధికారులకు సిఎం సూచించారు.

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాలకు హాజరుకండి
కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్, కిషన్ రెడ్డి,సంజయ్‌లకు సిఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమాలకు హాజరుకావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం లేఖలు పంపించారు.

1948, సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ఆ లేఖలో వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular