ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. జయరాజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. జయరాజ్ త్వరగా కోలుకుని బయటకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.