Saturday, September 21, 2024

తహసీల్దార్‌లు, నాయబ్ తహసీల్దార్‌ల బదిలీలు చేపట్టాలి

రెవెన్యూ మంత్రికి విజ్ఞప్తి చేసిన ట్రెసా
ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను తిరిగి పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని కోరుతూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 150 మంది తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు నాంపల్లిలోని ట్రెసా కేంద్ర కార్యాలయానికి చేరుకొని ట్రెసా రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికలు అయిపోయినా బదిలీలు లేక కుటుంబాలకు దూరంగా ఉండి విధులు నిర్వహిస్తున్నామని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్‌లు వెంటనే వారిని తీసుకొని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లారు. వారితో మాట్లాడిన మంత్రి వివిధ కేడర్ల బదిలీలు తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్ల బదిలీలపై సానుకూలంగా స్పందించారు.

త్వరలోనే వారి బదిలీలు చేపడతామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్‌లతో పాటు ఉపాధ్యక్షుడు కె. నిరంజన్, బాణాల రాంరెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమన్‌రెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు చంద్రశేఖర్, మధుకర్,నిర్మల్ అధ్యక్షులు వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular