Wednesday, September 18, 2024

వరంగల్ జిల్లా పదహారు చింతల్‌ ‌తండాలో గిరిజనుల జంట హత్య

కుటుంబంపై యువకుడు తల్వార్‌తో దాడి
భార్యాభర్తలు మృతి…కూతురు, కుమారుడికి తీవ్ర గాయాలు
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై  గిరిజనుల రాస్తారోకో

చెన్నరావుపేట మండలం పాపయ్యపేట శివారు పదహారు చింతల్‌లో తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్‌ (40), ‌బానోతు సుగుణ (35) తో పాటు కుమారుడు మదన్‌, ‌కూతురు దీపిక పై తల్వార్‌తో యువకుడు దాడి చేశాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో బానోతు సుగుణ అక్కడికక్కడే మృతిచెందగా, శ్రీనివాస్‌ ‌నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్‌లో మృతి చెందాడు. కుమారుడు, కూతురు తీవ్ర గాయాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ ఎం‌జిఎం కి తరలించారు. ప్రేమ వ్యవహారంలో మేకల బన్నీ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాడికి గురై మరణించిన దీపిక తల్లిదండ్రుల మృతదేహాలను మాజీ ఎంఎల్‌ఏ, ‌బిఆరెస్‌ ‌నేత పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి పరామర్శించారు.

తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక బాధిత కుటంంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ నర్సంపేట పట్టణంలోని పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదుట మృతుల బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఇద్దరిని హత్య చేయడమే కాకుండా మరో ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచిన నిందితుడు నాగరాజును నర్సంపేట పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారన్న అనుమానంతో స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎస్టీ కమ్యూనిటీ నాయకులు సైతం ధర్నాలో పాల్గొన్నారు. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ ‌చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న వారిలో ఒకరు పెట్రోల్‌ ‌పోసుకొని అంటించుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

ధర్నా చేపట్టి నాలుగు కూడళ్ల నుండి బ్లాక్‌ ‌చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. ధర్నాకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి సైతం హాజరయ్యారు. నిందితున్ని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారులపై వేధింపులు, హత్యలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. లా అండ్‌ ఆర్డర్‌ ‌సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. బాధిత కుటుంబ సభ్యులను బిఆర్‌ఎస్‌ ‌నాయకురాలు పెద్ది స్వప్న పరామర్శించారు. యువతి తల్లిదండ్రులను హతమార్చడం దారుణమని అన్నారు. పోలీసులు, చట్టాలపై భయం లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అమ్మాయిలను కన్న తల్లిదండ్రులు భయపడే రోజులు వొచ్చాయని అన్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేసి, నిందితుడిని వెంటనే శిక్షించాలని కోరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular