ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సుదీర్ఘ కాలం పని చేసి నిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసి చిన్న వయసులోనే పాత్రికేయులు శ్రీ తన్నీరు ఆదినారాయణ గారు మరణించడం బాధాకరం. మూడు దశాబ్దాలుగా ఎంతో నిబద్ధతతో ఈటీవీ లో కీలక బాధ్యతల్లో పని చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి జర్నలిస్టుగా గుర్తింపు పొందిన శ్రీ ఆదినారాయణ గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియ చేస్తున్నాను.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
కొలుసు పార్థసారథి
మంత్రి వర్యులు
హౌసింగ్ అండ్ ఐ అండ్ పి ఆర్
ఆంధ్ర ప్రదేశ్