మార్కెట్ ధరలకూ భూ పరిహారం చెల్లించాలని డిమాండ్
నేషనల్ మైవే అథారిటీ కార్యాలయం ముందు ధర్నా
ట్రిపుల్ ఆర్‌లో భూములు కల్పోతున్న బాధితులు హైదరాబాద్‌లో రోడ్డెక్కారు. తమను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్ బాధితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రిజినల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటే ప్రభుత్వం రూ.20 లక్షలు మాత్రమే చెల్లిస్తోందని…తమ భూములకు మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల నుంచి న్యాయం చేయాలని అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించు కోవడం లేదని ఆర్‌ఆర్‌ఆర్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు .
మున్సిపాలిటీల మధ్యలో నుంచి కాకుండా ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. వరంగల్ హైవే కోసం, కాళేశ్వరం కాలువల నిర్మాణానికి, ఎలక్టిస్రిటీ హైటెన్షన్ టవర్స్ కోసం, యాదగిరి గుట్ట రోడ్డు అభివృద్ది కోసం ప్రభుత్వం ఇప్పటికే తమ భూములు తీసుకుందన్నారు. అభివృద్ధి పేరుతో మళ్లీ తమ భూములను లాక్కుంటే వ్యవసాయం ఎలా చేసుకోవాలని..ఎలా బతకాలని ప్రశ్నించారు. భూముల కోల్పోతున్న బాధిత రైతులకు ప్రత్యామ్నాయం చూపి..సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ట్రిపుల్ ఆర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రభుత్వం ట్రిపుల్ నార్త్ పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తయింది. 161.518 కిలోటర్ల( ట్రిపుల్ ఆర్ నార్త్) రోడ్డును రూ.7104.06 కోట్లతో నిర్మిస్తున్నారు.
1వ ప్యాకేజీ: గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోటర్ల నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ. 1529.19 కోట్లతో రెండేండ్లలో నిర్మించాలి. ఐదేండ్లు మొయింటెనెన్స్ చేయాలి.
2వ ప్యాకేజీ: రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు 26 కిలోటర్ల 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ.1114.80 కోట్లతో రెండేండ్లలో నిర్మించాలి. ఐదేండ్ల మొయింటెనెన్స్ చేయాలి.3వ ప్యాకేజీ: ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోటర్ల నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ.1184.81 కోట్లతో రెండేండ్లలో నిర్మించాలి. ఐదేండ్లు నిర్వహించాలి.
4వ ప్యాకేజీ: ప్రజ్ఞపూర్ నుంచి రాయగిరి వరకు 43 కిలోటర్లు నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని 1728.22 కోట్లతో రెండేండ్లలో నిర్మించాలి. ఐదేండ్ల మొయింటెనెన్స్ చేయాలి. 5వ ప్యాకేజీ: రాయగిరి నుంచి తంగడ్ పల్లి వరకు 35 కిలోటర్ల నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ.1547.04 కోట్లతో రెండేండ్లలో నిర్మించాలి. ఐదేండ్లు నిర్వహించాలి ఈ క్రమంలో ఇప్పటకిఏ భూసేకరణ మొదలయ్యింది. తమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరించారు.
Related