Friday, January 10, 2025

ఆ హీరోలతో త్రివిక్రమ్‌కి ఇబ్బందులు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పంచ్‌ డైలాగులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయనకు టాలీవుడ్‌లో సగం క్రేజ్‌ ఆ డైలాగ్స్‌ వల్లనే వచ్చింది. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగా కూడా ఓ రేంజ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు తో ‘గుంటూరు కారం’ సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ని కాస్త నిరాశపరిచింది. సినిమా చూసిన ఎక్కువ శాతం ఆడియన్స్ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని బాహాటంగానే అన్నారు. దీంతో సినిమా రిలీజ్ తర్వాత ఆయనపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల త్రివిక్రమ్ తన సినిమాల సమయంలో జరిగిన సంఘటనలు తనను చాలా బాధించాయని చెబుతున్నారు.

త్రివిక్రమ్ కి ఇబ్బందులు వచ్చేది ఎక్కువగా స్టార్ హీరోల దగ్గర నుంచేనట. నిజానికి స్టార్ హీరోలు సినిమాకి కమిట్ అయ్యే ముందు పెద్దగా అభ్యంతరాలు చెప్పరు. కానీ సినిమా కమిట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చాలా అభ్యంతరాలు వస్తున్నాయి. ఫలితంగా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. త్రివిక్రమ్ కూడా ఇదే సమస్యను ఎదుర్కోవడంతో ఇప్పటినుంచి తనకు కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉన్నచోటే పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఒక్కసారి సినిమాకి కమిట్ అయ్యాక స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు అనేది ఆయన కోరిక. పవన్ కళ్యాణ్ దగ్గర త్రివిక్రమ్ కి ఇలాంటి విషయాల్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com