Thursday, November 21, 2024

Trump as US President అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌

  • కమలా హ్యారిస్‌పై ‌భారీ మెజార్టీతో గెలుపు
  • నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి వైట్‌హౌస్‌కు..

అ‌గ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ‌ట్రంప్ మ‌రోసారి ఎన్నికయ్యారు. ఎన్నికల పోరులో ఎదురీది విజయం సాధించారు. అమెరికన్లను ఆకట్టుకుని విజేతగా నిలిచారు.  అమెరికాలోని పత్రికలు జరిపిన సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకమని తేల్చినా.. ప్రజలు మాత్రం అండగా నిలిచారు. కొంత విరామంతో ఒక అభ్యర్థి అమెరికా అధ్యక్ష స్థానంపై తిరిగి కూర్చోవడం 131 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 2016 నాటి ఫలితాలకు భిన్నంగా ఈసారి పాపులర్‌ ‌వోటు కూడా ట్రంప్‌నకే లభించింది. ఆయనకు దాదాపు 51 శాతానికి పైగా వోట్లు లభించగా.. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌  47 ‌శాతం వద్దే ఆగిపోయారు. సంప్రదాయ రిపబ్లికన్‌ ‌రాష్ట్రాలను నిలబెట్టుకోవడంతో పాటు.. గంపగుత్తగా స్వింగ్‌ ‌స్టేట్స్ ఏడింటా ట్రంప్‌ ‌హవా నడిచింది. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, వేతనాలు, అక్రమ చొరబాట్లు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో తిరుగులేని విధంగా ప్రభావాన్ని చూపాయి. అరబ్‌, ‌ముస్లింలు అధికంగా ఉన్న జార్జియాలో మొదటి నుంచి కమలా హారిస్‌ ‌వెనుకంజలోనే ఉన్నారు. గతంలో ఇక్కడ బైడెన్‌ ‌హవా నడిచింది. కానీ, గాజా యుద్ధం విషయంలో డెమోక్రాట్ల వైఖరిపై వీరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

వీరిని బుజ్జగించేందుకు కమలా హారిస్‌ ‌ప్రచారం చివరిలో కూడా తాను గాజాలో శాంతిని నెలకొల్పేందుకు వీలైనంతగా యత్నిస్తానని హామీ  ఇచ్చారు. అది పెద్దగా ఫలితం చూపలేదు. మరో వైపు ట్రంప్‌ ‌తాను అధికారంలోకి వొస్తే వారం రోజుల్లో యుద్దాన్ని ఆపేస్తానని హామీ ఇచ్చారు. దీనికి తోడు ఆయన హయాంలో అఫ్గాన్‌ ‌యుద్దాన్ని ఆపడం, మరే కొత్త యుద్ధంలోనూ అమెరికా తలదూర్చకుండా ఉండటం కూడా సానుకూలంగా మారింది. ట్రంప్‌ ‌మద్దతుదారులు వలస అంశానికే అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ విషయాన్ని ఏపీ ఓట్‌ ‌కాస్ట్ ‌ప్రజాభిప్రాయ సేకరణ కూడా వెల్లడించింది. వాస్తవానికి ఉత్తర అమెరికాలో అక్రమ వలసదారులు పెద్ద సమస్యగా మారారు. ఈ విషయాన్ని ట్రంప్‌ ‌బలంగా వాడుకొన్నారు. జార్జియాలోని ప్రచారంలో మాట్లాడుతూ ఏకంగా 1798 నాటి ఎలియన్‌ ఎనిస్‌ ‌యాక్ట్‌ను తాను మళ్లీ తెరపైకి తెస్తానని హామీ ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌, ‌జర్మనీ, ఇటలీ వాసులను కట్టడి చేయడానికి దీనిని వాడేవారు.

దీని ప్రకారం అక్రమ వలసదారులు అమెరికన్లను హత్య చేస్తే .. వారికి మరణదండన విధిస్తారు. ట్రంప్‌ ‌విదేశాంగ విధానంలో యుద్దాలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వోటర్లను ఆకర్షించిన అంశం. ఇప్పటికే ఉక్రెయిన్‌, ‌గాజా యుద్ధాల్లో ఆ దేశం పాత్ర ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా కీవ్‌ను కాపాడేందుకు బిలియన్ల డాలర్ల సొమ్ము ఇవ్వడం సగటు అమెరికా వాసికి నచ్చలేదు. ట్రంప్‌ అధికారంలో ఉంటే రష్యాతో సరిగ్గా డీల్‌ ‌చేసేవారని స్వింగ్‌ ‌స్టేట్స్‌లో నిర్వహించిన సర్వేల్లో వోటర్లు అభిప్రాయపడ్డారు. చైనా విషయంలో బైడెన్‌ అత్యంత బలహీనంగా కనిపించారు. మరోవైపు గతంలో ఏ నిర్ణయాన్ని అయినా రెండో ఆలోచన లేకుండా స్థిరంగా తీసుకోవడం ట్రంప్‌నకు స్ట్రాంగ్‌ ‌మ్యాన్‌ ఇమేజ్‌ ‌తీసుకొచ్చింది.  ట్రంప్‌ను విజయతీరాలకు చేర్చిన బలమైన అంశాల్లో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ కూడా ఒకటి. 2020లో బైడెన్‌ అధికారం చేపట్టాక తీసుకొన్న నిర్ణయాలతో అమెరికా చాలా కాలం ద్రవ్యోల్బణం కారణంగా ధరల పెరుగుదలతో అవస్థపడింది. అప్పట్లో బైడెనామిక్స్ అం‌టూ డెమోక్రాట్ల విధానాలను హేళన చేసే పరిస్థితి తలెత్తింది. బైడెన్‌ ‌పాలసీల కారణంగా తాము అవస్థలు పడ్డామని చాలా మంది వోటర్లు వెల్లడించారు. ట్రంప్‌కు అమెరికాలోని గ్రామీణ వోటర్ల నుంచి బలమైన మద్దతు ఉంది. సర్వేలు ఎన్ని చెప్పినా అయోవా వంటి రాష్ట్రాల్లో ఆయనే విజయం సాధించడానికి ఇదే కారణంగా నిలిచింది.

ఇక జార్జియా, కెంటకీ, నార్త్ ‌కరోలినాల్లో ఇదే ఆయనకు ఆధిక్యం తీసుకొచ్చింది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ ‌పార్టీకి పార్లమెంట్‌లో భారీ మెజారిటీ వొచ్చింది. సెనేట్‌లో మెజార్టీ రిపబ్లికన్‌ అభ్యర్థులు విజయం సాధించారు. రిపబ్లికన్‌ ‌పార్టీకి చెందిన 51 మంది, డెమోక్రటిక్‌ ‌పార్టీకి చెందిన 42 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఫాక్స్ ‌న్యూస్‌ ‌నివేదిక ప్రకారం, రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ‌ట్రంప్‌ 270 ఎలక్టోరల్‌ ‌వోట్ల మెజారిటీ మార్కును అధిగమించారు. యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మెరికాలోని ఏడు స్వింగ్‌ ‌రాష్ట్రాల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ‌ట్రంప్‌ ఆధిక్యం చూపారు. ఏపీ ట్రెండ్స్ ‌ప్రకారం పెన్సిల్వేనియా, మిచిగాన్‌, ‌విస్కాన్సిన్‌, ‌జార్జియా, నెవాడా, అరిజోనా, నార్త్ ‌కరోలినాలలో ట్రంప్‌ ‌పైచేయి సాధించారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ‌ట్రంప్‌ ఇప్పటి వరకు 24 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఇంకా 5 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ 17 ‌రాష్ట్రాల్లో విజయం సాధించారు. డొనాల్డ్ ‌ట్రంప్‌కు మెజారిటీ వొచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా వివిధ  దేశాల అధినేతల శుభాకాంక్షలు  తెలుపుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular