Tuesday, March 18, 2025

ట్రంప్‌ సోషల్‌ మీడియాలో మోదీ ఖాతా

అమెరికా అధ్యక్షుడు డినాల్డ్‌ ట్రంప్‌ కొత్తగా సొంత సోషల్‌ మీడియాను తెరిచారు. ‘ట్రూత్‌ సోషల్‌’ అనే ఈ వేదికలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖాతా తెరిచారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా వెల్లడిస్తూ .. ‘హౌడీ మోదీ’ సందర్భంగా ట్రంప్‌తో దిగిన ఒక ఫోటోను పోస్టు చేశారు.
ట్రూత్ సోషల్‌లో చేరడం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అనేక మంది ఔత్సాహికులతో ఈ వేదిక ద్వారా సంభాషించేందుకు వేచి చూస్తున్నానని రాసుకొచ్చారు. మోదీ ట్రూత్ సోషల్‌లో ఖాతా ప్రారంభించడానికి ముందు మోదీకి సంబంధించిన ఓ వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను ట్రంప్ పోస్టు చేయడం పట్ల ఆయనకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com