Thursday, November 28, 2024

Breaking: పదో తరగతి పరీక్షల్లో మార్పులు

ఇకపై వంద మార్కుల పేపర్
ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసిన విద్యాశాఖ

పదో తరగతి పరీక్షల్లో విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. .ఇకపై 100 మార్కుల పేపర్ ఉండనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులను ఎత్తివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ 80 మార్కులకే పేపర్ ఉండేది, మరో 20 మార్కులతో ఇంటర్నల్ ఎగ్జామ్ ఉండేది. అయితే ఆ పద్ధతిని విద్యాశాఖ ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. గత కొన్ని సంవత్సరాలుగా గ్రేడింగ్ పద్ధతిలో రిజల్ట్స్ వచ్చాయి. తాజాగా గ్రేడింగ్ సిస్టమ్ ను ఎత్తివేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular