Monday, November 18, 2024

ప్రగతిపథంలో టిఎస్‌ఎండిసి

  • ప్రగతిపథంలో టిఎస్‌ఎండిసి
  • ఇసుకతో ఈ కార్పొరేషన్‌కు అధిక ఆదాయం
  • 2023, 24 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,377.85 కోట్ల రాబడి

ఇసుక అమ్మకం ద్వారా 2023,24 ఆర్థిక సంవత్సరం (మార్చి 31)వ తేదీ వరకు టిఎస్‌ఎండిసి (తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్)కు సుమారు రూ.5,377.85 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. 2014లో మైన్స్ డిపార్ట్‌మెంట్‌కు అనుబంధం ఉన్న ఈ శాఖను 2014, అక్టోబర్‌లో టిఎస్‌ఎండిసి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2015లో ఇసుకకు సంబంధించిన విధి, విధానాలను రూపొందించడంతో టిఎస్‌ఎండిసి కార్పొరేషన్ ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలను ప్రారంభించింది. 2015,16 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఇసుక ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూ టిఎస్‌ఎండిసి ముందుకు సాగుతోంది.

ఎక్కడికక్కడ ఇసుక యార్డుల ఏర్పాటు

రాష్ట్రంలో అతి పెద్ద ఇసుక రీచ్‌లు జయశంకర్ భూపాలపల్లి, ములుగులో ఉండగా, భద్రాచలంలో చిన్న రీచ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి నుంచే ఇసుకను లారీల్లో తరలించడానికి టిఎస్‌ఎండిసి అనుమతిస్తోంది. ఇక ప్రభుత్వానికి సంబంధించి పనులకు కరీంనగర్, సిరిసిల్ల, నల్లగొండలోని మూసీ రివర్, మహబూబ్‌నగర్ రీచ్‌లను వినియోగిస్తున్నారు. గోదావరి వద్ద ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల వద్ద ఏర్పాటు చేసిన (ఇసుక యార్డుల్లో) 50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వచేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక యార్డులను ఏర్పాటు చేసి లారీల్లో ఇసుకను తరలించడానికి టిఎస్‌ఎండిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

లాక్‌డౌన్‌లో రీచ్‌ల మూసివేత

కరోనా సమయంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్ 2020 నుంచి మే 05 వరకు ఇసుక రీచ్‌లను టిఎస్‌ఎండిసి మూసివేయడంతో సుమారుగా రూ.40 నుంచి 50 కోట్ల ఆదాయాన్ని ఆ సంస్థ కోల్పోయింది. దీంతోపాటు జూల్ నుంచి నవంబర్ వరకు (2020 సంవత్సరంలో) రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు కురిసిన నేపథ్యంలో రీచ్‌లను టిఎస్‌ఎండిసి మూసివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్ని అవరోధాలను తట్టుకొని ప్రతి సంవత్సరం టిఎస్‌ఎండిసి ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటోంది. టిఎస్‌ఎండిసి ప్రస్తుతం నిరంతరం 98 ఇసుక రీచ్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు వివిధ జిల్లాలతో పాటు నగర నిర్మాణ అవసరాలను తీర్చడానికి హైదరాబాద్ చుట్టూ అబ్దుల్లాపూర్‌మెట్, వట్టినాగులపల్లి, బోరంపేటలో ఇసుక సబ్ స్టాక్‌యార్డ్‌లతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సబ్ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసింది. టిఎస్‌ఎండిసి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, మెదక్, మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లోని ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో జయశంకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇసుక లభ్యత అధికంగా ఉందని అధికారులు తెలిపారు.

2019, 20 సంవత్సరంలో రూ.3,609 కోట్లు

2019, 20 సంవత్సరంలో (రూ.3,609 కోట్లు), 2020,21 సంవత్సరంలో (రూ.3,612.62 కోట్లు), 2021,22 సంవత్సరంలో (రూ.2,381.55కోట్లు), 2022,23 సంవత్సరంలో (రూ.7,705.53 కోట్లు), 2023,24 సంవత్సరంలో (రూ.5,377.85 కోట్లు) ఈ సంస్థ ఆర్జించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular