Friday, November 15, 2024

ప్రజల సొమ్ముతో దేశమంతా ప్రకటనలు ఇచ్చింది బిఆర్‌ఎస్ పార్టీ

  • గత ప్రభుత్వ హయాంలో ప్రజల సొమ్ముతో
  • దేశమంతా ప్రకటనలు ఇచ్చింది బిఆర్‌ఎస్ పార్టీ
  • టిజిఎండిసి చైర్మన్ ఈరవత్రి అనిల్

గత ప్రభుత్వ హయాంలో ప్రజల సొమ్ముతో దేశమంతా ప్రకటనలు ఇచ్చింది బిఆర్‌ఎస్ పార్టీ అని తెలంగాణ ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ (టిజిఎండిసి) ఈరవత్రి అనిల్ ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్ర పత్రికలో యాడ్ వచ్చిన మాట వాస్తవమేనని, కానీ, అది కాంగ్రెస్ పార్టీ ప్రచురణకు ఇచ్చిన యాడ్ అని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ చెయ్యి గుర్తు కూడా ఉందని, దానిని గమనించాలని, కాంగ్రెస్ యాడ్ ఏదో..? ప్రభుత్వ ప్రకటన ఏదో తెలియదా..? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటనల కోసం బడ్జెట్ లో రూ.300 కోట్లు కేటాయించి, మహారాష్ట్రలో యాడ్ ఇచ్చిందని చెప్పడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఇలాంటి ఫేక్ వార్తలు ఎందుకని ఆయన మండిపడ్డారు.

అంతేగాకుండా గత ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో ప్రకటనలు ఇచ్చిందని చెబుతూ వాటికి సంబంధించిన ఆధారాలను మీడియా ఎదుట చూపించారు. ఒక్క మహారాష్ట్రలోనే కాదు దేశమంతా వివిధ భాషల్లో ప్రభుత్వ సొమ్ముతో యాడ్‌లు ఇచ్చారని, మళ్లీ తిరిగి దొంగలే పోలీసులను దొంగ దొంగ అన్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో పార్టీ కార్యక్రమాలు జరిపి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసింది వాస్తవం కాదా అని బిఆర్‌ఎస్ నాయకులను ఈరవర్తి అనిల్ నిలదీశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular