Friday, April 4, 2025

విజయ తారలు

  • ఏపీలో గెలిచిన పాపులర్​ స్టార్స్​
  • మండీ నుంచి కంగనా రనౌత్​
  • కేరళలో నటుడు సురేష్​ గోపి
  • సార్వత్రిక సమరంలో గ్లామర్​ గెలుపు

లోక్‌సభ ఎన్నికల్లో గ్లామర్​గెలిచింది. ఆయా రాష్ట్రాల్లో ఎంపీ సెగ్మెంట్లలో పలువురు సినీ తారలు విజయం సాధించారు. ప్రధానంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు స్టార్​లు సత్తా చాటారు. జనసేన పార్టీ అధినేత పవన్​కళ్యాణ్​తనతో సహా.. మొత్తం 21 స్థానాల్లో పార్టీ నేతలను గెలిపించుకున్నారు. పిఠాపురం నుంచి బరిలోకి నిలిచిన పవన్​.. ఈసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక, బీజేపీకి చెందిన కంగనా రనౌత్, సురేష్ గోపి విజయం సాధించారు. మధుర బీజేపీ అభ్యర్థి హేమ మాలిని ఆధిక్యం ప్రదర్శించారు.

బాలయ్య హ్యట్రిక్​
హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. ఎన్టీ రామారావు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు.

Balayya hat trick

2014లో 81,543 ఓట్ల మెజార్టీతో విజయఢంకా మోగించిన ఆయన.. 2019లో 91,704 వేల ఓట్ల మెజార్టీతో అఖండ విజయాన్ని నమోదు చేశారు. అయితే.. 2019లో టీడీపీ ఓడిపోవడంతో బాలకృష్ణ ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఇప్పుడు 2024లోనూ సమీప వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికను భారీ మెజారిటీతో ఓడించి విజయకేతనం ఎగరవేశారు. దీంతో.. నందమూరి అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు.. బాలయ్యకు శుభాకాంక్షలు తెలపడం కోసం భారీఎత్తున ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. అక్కడ వారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

పవన్​ టీం
జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. పిఠాపురంలో డెబ్బై వేలకు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద పవన్ విజయం సాధించడంతో జనసైనికులు సంబంరాలు చేసుకున్నారు.

అటు ఏపీలో.. ఇటు హైదరాబాద్ లో పవన్ ఫ్యాన్స్ సెలబ్రెట్ చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచే పవన్​ కళ్యాణ్​ మెజార్టీ వైపు దూసుకుపోయారు. దీంతో ఉదయం నుంచే పవన్ ఇంటివద్దకు భారీగా అభిమానులు చేరుకోగా.. పవన్ సతీమణి అన్నా లెజినోవా, అకిరా నందన్ బయటకు వచ్చి ఫ్యాన్స్‏కు అభివాదం చేశారు.

అన్నా లెజినోవా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతుండగా.. గేటు వద్ద అకిరా నిలబడి అందరికీ అభివాదాలు తెలిపారు. పవన్ గెలుపుతో ఇటు సినీ పరిశ్రమలో కూడా సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, సినీ ప్రముఖులు, నటీనటులు జనసేన అధినేతకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నితిన్, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు.

బేబీ ప్రోడ్యూసర్ ఎస్కేఎన్ పవన్ కు అభినందనలు తెలుపుతూ.. వ్యూహం నాకు వదిలేయండి అంటూ ట్వీట్ చేశారు. అలాగే నిర్మాత నాగవంశీ, నటుడు బహ్ర్మాజీ, డైరెక్టర్ మారుతీ, కాజల్ అగర్వాల్ జనసేన అధినేతకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేశారు. మరోవైపు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ యూనిట్ లో చిత్రయూనిట్ టపాసులు కాల్చి, డ్యాన్సులు చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్లలో డైరెక్టర్ హరీష్ శంకర్ పాల్గొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలైంది.

పిఠాపురం నుంచి పవన్​ కళ్యాణ్​ నామినేషన్​ వేసినప్పటి నుంచి కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చి పిఠాపురంలో ప్రచారం చేశారు. నాగబాబు.. నాగబాబు భార్య పద్మజ, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరో సాయిధరమ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, రామ్ చరణ్ ఇలా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు . చిరంజీవి సైతం స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ దాదాపు 74 వేల ఓట్ల మెజారిటీతో వంగా గీతాపై ఘనవిజయం సాధించారు.

పవన్​తో పాటుగా జనసేన నుంచి టికెట్లు ఇప్పించుకున్న 20 మంది సైతం ఏపీలో విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పవన్ గెలుపు సంచలనంగా మారింది . పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం పై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు పిఠాపురంలో లైవ్ స్క్రీన్పై చూసిన పవన్ సోదరుడు నాగబాబు సోదరి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినవో.. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ అభిమానులకు థాంక్స్ చెప్పారు. ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ కొడుకు సేమ్ తండ్రిలాగే జనసేన పిడికిలి చూపించి విన్నింగ్ మూమెంట్లు ఎంజాయ్ చేశారు .

తిలకం దిద్దిన అనా


భారీ విజయోత్సాహంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరికి వెళ్లారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్‌కు ఆయన సతీమణి అనా కొణిదెల విజయ తిలకం దిద్ది హారతి ఇచ్చారు. పవన్ తనయుడు అకిరా నందన్ సైతం ఆయన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అకిరానందన్ ఎమోషనల్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోజా ఓడిపోయింది


సీనీ తార, మాజీ మంత్రి రోజా ఈసారి ఓటమిపాలయ్యారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసిన రోజా.. టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్​ రెడ్డి చేతుల్లో ఓటమిపాలయ్యారు. కాగా ఫలితం వెలువడక ముందే ఓటమిని అంగీకరించిన రోజాపై ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ సెటైరికల్ ట్వీట్ వేశారు. ‘జబర్దస్త్ పిలుస్తోందిరా.. కదలిరా’ అంటూ రోజా ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ప్రచారం చేసి గెలిపించారు
ఎన్నికల సందర్భంగా పలువురు సినీ నటులు , సినిమాలను కూడా పక్కన పెట్టి మరీ తమ సన్నిహితుల తరపున పొలిటికల్ ప్రచారాలు చేశారు. తమకు నచ్చిన పొలిటికల్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ, అభ్యర్ధులను గెలిపించేందుకు తమవంతు కృషి చేశారు. మెగాస్టార్ చిరంజీవి నేరుగా రంగంలోకి దిగకున్నా జనసేన కు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చి తన మద్దతు తెలిపారు. అనకాపల్లి ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్.. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్ లను గెలిపించాలని కోరుతూ వీడియోను హీరో వెంకటేశ్​ రిలీజ్​చేసి.. ప్రచారం చేశారు. ఇటు పవర్ స్టార్ కోసం జబర్దస్త్ స్టార్స్ అందరు పిఠాపురంలో దిగి.. అక్కడే ఉంటూ స్వచ్చందంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ లాంటి జబర్దస్త్ కమెడియన్స్ కూడా పవన్ కు ప్రచారం చేశారు.

యంగ్ హీరో నిఖిల్ కూడా చీరాల టిడిపి అభ్యర్థి కొండయ్య కు ఓటు వేసి గెలిపించాలని అక్కడి ప్రజల జీవన విధానాన్ని కష్టాలను దగ్గరుండి చూస్తూ ,ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు సోదరుడి కుమారుడు నారా రోహిత్ సైతం తెలుగుదేశం, జనసేన, భాజాపా అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం చేశారు. మన కోసం మన నారా రోహిత్ అంటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. 30 ఇయర్స్ పృథ్వీరాజ్ కూటమీ గెలుపు కోసం‌ ఎపీలో ప్రచారాలను నిర్వహించారు . అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కు మద్దతుగా భాజపా నాయకురాలు, సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ప్రచారం చేశారు. ధర్మవరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ను గెలిపించాలని బీజేపీ మద్దతుదారు, సినీ నటి నమిత ప్రచారం చేశారు. ఇలా పలువురు నటులు, తమకు నచ్చిన అభ్యర్దులు, పార్టీల కోసం స్టార్ క్యాంపెయినర్లుగా మారి ప్రచారం చేసి గెలిపించుకున్నారు.

దేశంలో..!
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ పోటీ చేయగా, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నటుడు అరుణ్ గోవిల్ , కేరళలోని త్రిసూర్‌లో సురేష్ గోపి కాషాయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో శతృఘ్న సిన్హాను టీఎంసీ బరిలోకి దింపింది.

ప్రముఖ సెలబ్రిటీ అభ్యర్థులు రాధికా శరత్‌కుమార్ (బీజేపీ) విరుదునగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. లాకెట్ ఛటర్జీ (బిజెపి, హుగ్లీ), మనోజ్ తివారీ (బిజెపి, ఈశాన్య ఢిల్లీ), రవి కిషన్ (బిజెపి, గోరఖ్‌పూర్), పవన్ సింగ్ (స్వతంత్ర, కరకట్), పవన్ కళ్యాణ్ (జనసేన, పిఠాపురం ) , ముఖేష్ (సీపీఐఎం, కొల్లాం), జీ కృష్ణ కుమార్ (బీజేపీ, కొల్లం) పోటీ చేశారు.

బాలీవుడ్ డ్రీమ్ గార్ల్ గెలిచింది
అలనాటి మేటి నటి, దర్శకురాలు, నిర్మాత కూడా అయిన హేమమాలిని బీజేపీలో చాలాకాలంగా పనిచేస్తున్నారు. 2014 నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర ఎంపీగా గెలుస్తున్న ఆమె, తాజా ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. 1999లో సీనియర్‌ నటుడు వినోద్‌ ఖన్నా పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌లో బీజేపీ తరఫున పోటీచేయగా ఆయన గెలుపు కోసం హేమమాలిని ప్రచారం చేశారు.

2003 నుంచి 2009 వరకూ బీజేపీ క్రియాశీలక నేతగా ఉన్న హేమమాలిని 2011లో రాజ్యసభకు నామినేట్‌ ‌అయ్యారు. 1963లో తమిళ చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసిన హేమమాలిని అద్భుత నటనతో బాలీవుడ్‌లో డ్రీమ్‌ గాళ్‌గా స్థిరపడ్డారు. వందలాది హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన హేమ, సీనియర్‌ నటుడు ధర్మేంద్రను వివాహం చేసుకున్నారు. తాజా ఎన్నికల్లో డ్రీమ్​ గార్ల్​ గెలిచింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com