Wednesday, December 25, 2024

టీఎస్​పీఎస్సీ పరీక్షలన్నీ రీ షెడ్యూల్​

నిరుద్యోగులకు కాంగ్రెస్​ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. టీఎస్​పీఎస్సీపై సోమవారం సీఎం రేవంత్​రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్​ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణపై చర్చించారు. దీనిలో భాగంగా టీఎస్​పీఎస్సీ పరీక్షలన్నీ రీ షెడ్యూల్​ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన జాబ్​ క్యాలెండర్​ ప్రకారం కొత్తగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్లపై మరోసారి సమీక్షించనున్నారు. ఈ పరీక్షలను రీ షెడ్యూల్​చేయాలని సీఎం రేవంత్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రూప్​–1 నుంచి గ్రూప్​ 3 వరకు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని భావిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com