Saturday, January 4, 2025

టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా ఆకునూరి మురళి?

ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి స్పెషల్​ టీం
యూపీఎస్సీ విధానాలపైనా స్టడీ

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్​రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే వరుసగా సమీక్షిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ అంశంపై గత ప్రభుత్వం ఎదుర్కొన్న విమర్శలు తమపై రావద్దనే కోణంలో నియామకాలపై స్పీడ్​ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం టీఎస్​పీఎస్సీ పాలకవర్గం చాలా వివాదాల్లో ఉంది. ప్రశ్నాపత్రాల లీకేజీలతో కేసుల పాలైంది. పాలకవర్గం మొత్తం రాజీనామా బాటలో నిలిచారు. ఈ నేపథ్యంలోనే కొత్త చైర్మన్​ఎంపికకు రేవంత్​ సర్కారు ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో ఐఏఎస్​కు రాజీనామా చేసి, వీఆర్​ఎస్​ తీసుకున్న ఆకునూరి మురళికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ఆకునూరి మురళి.. రేవంత్​రెడ్డికి కొన్ని విధానపరమైన అంశాల్లో అండగా నిలిచారు. నిరుద్యోగుల తరుపున ఆయన ఉద్యమం చేశారు. ఇప్పుడు రేవంత్​కు మద్దతుగా ఉండటంతో.. ఆయన్ను టీఎస్​పీఎస్సీ చైర్మన్​ గా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఆయన కూడా గత కొంతకాలంగా విద్య, వైద్య రంగాలపై అధ్యయనం చేస్తున్నారు.

ఆకునూరి మురళి భూపాలపల్లి జిల్లా కలెక్టర్​గా ఉన్న సమయంలో కొన్ని అంశాల్లో వివాదస్పదంగా మారారు. ఆయనపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడంతో.. వీఆర్​ఎస్​ తీసుకున్నారు. ఆ తర్వాత పరిణామాల్లో ఆయనకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. విద్యా, మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుడిగా నియమించింది. ఏపీలో మురళి చేసిన నాడు–నేడు సూపర్​ సక్సెస్​ అయింది. ఆ తర్వాత ఆయన ఏపీలో సలహాదారుడి పదవికి సైతం రాజీనామా చేసి, రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో అధ్యయనం చేశారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక చేపట్టిన జాగో తెలంగాణ బస్సు యాత్రలో ఆకునూరి మురళి కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం కాంగ్రెస్​ విజయంలో బ్యాక్​ఎండ్​గా వ్యవహరించిన ఆయనకు.. టీఎస్​పీఎస్సీ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పాలకమండలి కూర్పు ఈసారి పారదర్శకంగా ఉండాలని సీఎం రేవంత్​ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆకునూరి మురళికి చైర్మన్​గా అవకాశం ఇస్తారని టాక్​.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com