Monday, April 21, 2025

విదేశాల్లో ఉద్యోగాలంటే నిరుద్యోగులు నమ్మవద్దు

టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ హెచ్చరిక
నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగాలంటే గుడ్డిగా నమ్మవద్దని టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలంటూ కాంబోడియాకు తీసుకెళ్తూ నిరుద్యోగులతో చైనా కంపెనీలు బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయని ఆయన తెలిపారు. వారిని నిర్బంధించి అక్కడి నుంచి ఇండియాలో జాబ్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ స్కామ్స్, క్రిప్టో కరెన్సీ మోసాలు చేయాలని బెదిరింపులకు దిగుతున్నాయన్నారు. వారిని అక్కడ వ్యసనాలకు బానిసలుగా చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

విదేశాల్లో ఉద్యోగాలు లక్షల్లో సంపాదన అని నిరుద్యోగులను నమ్మించి కాంబోడియాకు విక్రయిస్తున్న ముఠాను తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారని ఆయన చెప్పారు. ఈ కేసులో ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేశారని, కాంబోడియాకు దాదాపు 5 వేల మందిని వారు పంపించారన్నారు. ఇలాంటి ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగం ఇస్తామని అనగానే నమ్మి విదేశాలకు వెళ్లి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని ఆయన సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com