Wednesday, January 8, 2025

ఆర్టీసీలో రిక్రూట్​మెంట్​

  • ఆర్టీసీలో రిక్రూట్​మెంట్​
  • ఏండ్ల తర్వాత కండక్టర్ల పోస్టుల భర్తీ
  • త్వరలో కళాశాలల ఏరియాలకు ప్రత్యేక బస్సులు

టీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు సరిపోయేంత సిబ్బంది లేక, ప్రతి నిత్యం ప్రజల నుంచి ఆర్టీసీ విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తున్నది. ఆర్టీసీలో ప్రస్తుతం 2 వేల డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని కండక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో నిత్యం బస్సుల రాకపోకల కోసం సిబ్బందిని సమకూర్చే విషయంలో అధికారులు సతమతం అవుతున్నారు.

ఈ ఇబ్బందులను అధిగమించేందుకు సిబ్బంది నియామకాలు చేపట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు డ్రైవర్‌ కమ్‌ కండక్టర్‌ పోస్టుల భర్తీకి ముందుకొచ్చింది. జిల్లాలు, ఇతర రాష్ర్టాలకు వెళ్లే సర్వీసుల్లోనూ డ్రైవర్‌, కండక్టర్‌ డ్యూటీ ఒకరే చేసేలా నియామకాలు చేపట్టనున్నట్టు తెలిసింది. డ్రైవర్‌ ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తి కండక్టర్‌ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ నిబంధనలను రూపొందిస్తున్నది.

దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఖర్చు కూడా తగ్గుతుందనే భావనతో ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌ నగరంతోపాటు శివారుల్లోని కళాశాలలు, విద్యాసంస్థల సమయపాలన ఒకేలా ఉండేలా మార్చాలని కోరుతూ ఆర్టీసీ లేఖలు రాసింది. వాటికి అనుగుణంగా 1,500 బస్సులను కళాశాలలు, విద్యాసంస్థల సమయాల్లో నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతున్నది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com