Monday, May 5, 2025

టీటీడీ కల్యాణ వేదిక కార్యక్రమానికి విశిష్ట స్పందన

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న కల్యాణ వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదిక వద్ద 2016 ఏప్రిల్ 25 నుంచి టీటీడీ వివాహాలు నిర్వహిస్తోంది. ఈ వివాహాలకు వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని నిబంధన విధించారు. ఒకవేళ వారు రాలేని పరిస్థితుల్లో ఉంటే, అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ పథకం ప్రారంభించిన తర్వాత, ఈ ఏడాది మే 1 వరకు 26,214 వివాహాలు జరిగినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ పథకం ద్వారా వివాహానంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తంగా ఆరుగురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అనంతరం ఉచితంగా ఆరు లడ్డూలను లడ్డూ కౌంటర్ వద్ద అందజేస్తున్నారు. ఈ పథకం కింద తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com