Sunday, September 29, 2024

TTD Laddu rates: ఆ వార్తలు నమ్మొద్దు.. ధరలు తగ్గించలేదు: టీటీడీ

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు – టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం – టీటీడీ

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది.

పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలును టీటీడీ సవరించినట్లు వస్తూన్న వార్తలు అవాస్తవమని భక్తులకు తెలియజేయడమైనది.

ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దు – భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

ఈ రోజు కొన్ని వాట్స్అప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్కులేట్ అవుతున్నది.

వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగింది.

భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉన్నది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీ ల ద్వారా కాకుండా, నేరు గా, రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది. భక్తులు గమనించ గలరు.

అయితే కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని ఇందుకుగాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టిటిడి విజిలెన్స్ విభాగము కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేయడమైనది అంతేకాకుండా ఇటువంటి దళారుల మాటి నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular