Saturday, April 19, 2025

టీటీడీలో కొంత వెసలుబాటు

వారానికి రెండుసార్లు లేఖ సిఫారసు లేఖలు

తెలంగాణ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు వారానికి రెండుసార్లు అనుమతిస్తామని ప్రకటించింది. ప్రజాప్రతినిధుల సిఫారసుల మీద దర్శనానికి వచ్చినవారికి ప్రత్యేక దర్శనం అయ్యేలా చూస్తామని బోర్డు స్పష్టం చేసింది.

తెలంగాణ భక్తులపట్ల నిర్లక్ష్యం..
ఇటీవల తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమలలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నుంచి తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. శ్రీశైలం భ్రమరాంబసహిత మల్లికార్జునస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. తెలంగాణ భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని, తెలంగాణ వారి వల్లే తిరుమలకు ఆదాయం సమకూరుతుందని ఆమె చెప్పారు. అప్పుడు దురదృష్టం వల్ల తెలంగాణ శ్రీశైలాన్ని కోల్పోయిందన్నారు. టీటీడీ తెలంగాణలో ధర్మప్రచారానికి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో దేవాలయాలు, కల్యాణ మండపాల నిర్మాణానికి టీటీడీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో దిగొచ్చిన టీటీడీ బోర్డ్ వారానికి రెండుసార్లు అనుమతిస్తామని స్పష్టం చేసింది.
టీటీడీలో కొంత వెసలుబాటు
వారానికి రెండుసార్లు లేఖ సిఫారసు లేఖలు

తెలంగాణ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు వారానికి రెండుసార్లు అనుమతిస్తామని ప్రకటించింది. ప్రజాప్రతినిధుల సిఫారసుల మీద దర్శనానికి వచ్చినవారికి ప్రత్యేక దర్శనం అయ్యేలా చూస్తామని బోర్డు స్పష్టం చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com