Wednesday, February 26, 2025

‘టుక్‌ టుక్‌’ మ్యాజిక్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌

వైవిధ్యమైన సినిమాలకు, న్యూ కాన్సెప్ట్‌లకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రాలకు తెలుగులో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి చిత్రాలను చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అఖండ విజయాన్ని అందిస్తుంటారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ కోవలోనే ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్‌ టుక్‌’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్‌ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్‌. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మహా శివరాత్రి కానుకగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ” న్యూ ఏజ్‌ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండే స్కూటర్‌ కమ్‌ ఆటో ఎన్నో మ్యాజికల్‌ పవర్స్‌ను కలిగి ఉంటుంది. అందరూ ఆ వెహికల్ ప్రేమలో పడిపోతారు. దానికి ఓ మంచి రహస్యం కూడా ఉంటుంది. సినిమాలో ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా పంచుతుంది. యువతరం నచ్చే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే భావోద్వేగాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే విశ్వాసం వుంది’ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ” సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన, “టుక్ టుక్” ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంటుంది. అసలు కథలో ఆ స్కూటర్‌ కమ్‌ ఆటో పాత్ర ఏంటి అనేది సినిమాలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో కొనసాగుతుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుంది. ఈ వేసవికి ప్రేక్షకులకు మంచి వినోదం అందించండానికి మార్చి 21న మా టుక్‌ టుక్‌ రెడీ అవుతోంది’ అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com