టీఎస్, న్యూస్: హైదరాబాద్: తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు గానే.. జాతీయ స్థాయి లోనూ కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. తుక్కుగూడలో ఏర్పాటు చేసిన ‘కాంగ్రెస్ జన జాతర’ సభ వేదికగా జాతీయ స్థాయి మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు.
ఇందులో 5 గ్యారంటీలు ఉన్నాయన్న ఆయన.. యువతకు ఏడాదికి రూ. లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తామన్నారు. ‘మహిళ న్యాయం’ ద్వారా మహిళలకు ఏటా రూ. లక్ష మొత్తాన్ని నేరుగా బ్యాంకులో జమ చేస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర అందిస్తామన్నారు. ఇకపై, దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ. లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండ బోదని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.