తుమ్మల చెరువు జాడ కనిపెట్టాలంటూ ఓ ఊరి గ్రామ ప్రజలు రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. మహేశ్వరం మండలం తుక్కుగూడలో 8 ఎకరాల్లో తుమ్మల చెరువు ఉండాలని, కబ్జా చేసి వెంచర్లు వేశారని గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కబ్జాతో వర్షాకాలంలో పొలంలోని పంటలు మునుగుతున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి తీవ్రంగా విసిగిపోయామని, పోలీసులైనా చెరువు ఆచూకీ వెతికిపెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం ఏరియాలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. రాయదుర్గం సర్వే నెంబర్ 3, 4, 5 మొత్తం ప్రభుత్వం స్థలం ఉంది. అందులో అక్రమంగా కొందరు శాశ్వత నిర్మాణాలు నిర్మించారు. వీటిపై హైడ్రాకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లి ఇళ్లను నేలమట్టం చేశారు.
ఈ క్రమంలో స్థానికులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా హైడ్రా ఇప్పటి వరకు 18 చోట్ల చెరువులు, పార్కు స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేసి… దాదాపు 43.94 ఎకరాలు చెరువు భూములను స్వాధీనం చేసుకుంది.