Saturday, April 19, 2025

Hyderabad Heavy Rainfall: తెలంగాణకు రెండు రోజుల భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో వానలు

వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని Hyderabad Meteorological Centre హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎడీ అధికారులు తెలిపారు. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉండగా, దాని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని స్పష్టం చేశఆరు. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని ఉత్తర జిల్లాలపై ఉంటుంది ప్రకటించారు.

మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌ నగర్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వానలు కురుసే ఛాన్స్ ఉందని.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండి. ఇటు హైదరాబాద్‌ లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రానికి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com