మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి – జామండ్లపల్లి గ్రామాల మధ్య రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన రామ్ చరణ్, అరుణ్ అనే ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ కు కళాశాలకు వెళ్తున్నారు.
మహబూబాబాద్ వైపు నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కారు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సీఐ తెలిపారు