Tuesday, April 22, 2025

తలయివాకి యుఎఇ గోల్డెన్‌ వీసా

సూపర్‌స్టార్ రజనీకాంత్ కి యుఎఇ (UAE) ‘గోల్డెన్ వీసా వచ్చింది. అబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ (DCT) నుండి తలైవాకి ఈ వీసా వచ్చినట్లు ప్రకటించారు. ఆయనకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు డిటిసి మ్యానేజింగ్‌ డైరెక్టర్‌ అయిన మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్, అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిటిసి ఛైర్మన్, అబు గురువారం అబుదాబిలోని డిసిటి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ధాబి ప్రభుత్వం ఎమిరేట్స్ ఐడిని లెజెండరీ నటుడి రజనీకాంత్‌కి అందజేసింది.

గోల్డెన్ వీసా అందుకున్న తర్వాత, సూపర్ స్టార్ సోషల్‌ మీడియా ద్వారా ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. “అబుదాబి ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన యుఎయి గోల్డెన్ వీసాను స్వీకరించడం నాకు ఎంతో గౌరవంగా ఉందని ఆయన తెలిపారు. అబుదాబి ప్రభుత్వానికి మరియు నా మంచి స్నేహితుడు యూసుఫ్ అలీ ఎమ్‌ఎ, లులు గ్రూప్ సిఎమ్‌డికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. వీసాను ఆయనకు అందించి సత్కరించినందుకు దీనికోసం ఆయనకు మద్దతు తెలపిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.”

యుఎయి ఎగ్జిక్యూటివ్‌ మినిస్టర్‌ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ రజనీకాంత్‌ను అతని ప్యాలెస్‌లో కలిశారు. తమిళ సూపర్ స్టార్ అబుదాబిలో కొత్తగా నిర్మించిన BAPS హిందూ మందిర్ మరియు షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును కూడా సందర్శించారు. సూపర్‌స్టార్ ఇటీవలే తన ‘వెట్టయన్’ సినిమా షూటింగ్‌ను ముగించారు.

 

 

 

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com