రాష్ట్ర ఉభయసభలు ఈ నెల 21న ఉదయం 10గంటలకు వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం 11:14 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. మరో వైపు మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత సభను వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ప్రకటించారు.